Robbery in Shirdi Train: షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లో దొంగలు పడ్డారు. దొరికినంత దోచుకుని పరారయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భోగిలో తెల్లవారుజామున దొంగలు దోపిడీ చేయడం.. దొరికింది దోచుకుని ఊడాయించడం చర్చకు దారితీస్తోంది. ప్రయాణికులు లగేజీ మొత్తాన్ని దుండగులు ఎత్తుకుపోయారు. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా లగేజీని దోచుకుని పోయారు. బీదర్ రాగానే లగేజ్ చోరీ అయినట్లు ప్రయాణికులు గుర్తించారు. బీదర్ లో ట్రైన్ ఆపేసి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అధికారులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువ మంది తెలుగువారే కావడం విశేషం. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్
తెల్లవారు జామున ఈ దొంగతనం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఏకంగా మూడు భోగీలో చోరీ చేసేందుకు పాల్పడ్డారంటే ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయానికుల్లో కొందరు దొంగలకు సంబంధించిన వారు ప్రయాణించి సమాచారం ప్రకారం దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమనిస్తున్నారు. అయితే ప్రయాణికులు మూడు భోగీల్లో కూడా ఒక్కరు కూడ మెలకువ లేకపోవడం పై పలు అనుమానం వ్యక్తం చేస్తున్నా అధికారులు. అయితే బీదర్ వరకు లగేజీ లేదని ప్రయాణికులు అనుమానం లేకుండా దొంగలు దోపిడీ చేశారని తెలిపారు. అసలు ఈ దోపిడి ఏ దారిలో జరిగిందని, రైలు ఎక్కడెక్కడ ఆగి ఉందని సమాచారం సేకరిస్తున్నారు. ప్రయాణికులు లగేజీనే టార్గెట్ చేసి దొంగలు ట్రైన్‌ను పాలో అయినట్లు తెలిపారు. దర్యాప్తు చేసి దొంగనలు పట్టుకుంటామని వదిలే ప్రసక్తే లేదని అధికారులు తెలిపారు.
Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు