NTV Telugu Site icon

Heavy Rains: రాష్ట్రంలో కురుస్తున్న వానలు.. తెలంగాణలో జిల్లాల పరిస్థితి ఇదీ..

Rain Alert Telangana

Rain Alert Telangana

Heavy Rains: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తు న్నాయి. వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలోని ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాలకు ఏ ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..

జల దిగ్బంధంలో మణుగూరు..

భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలకు మణుగూరు జల దిగ్బంధంగా మారింది. అర్ధరాత్రి వరద ఊరును చుట్టుముట్టింది. దీంతో కొట్టుకుపోయిన కార్లు, బైకులు, నిత్వాసర వస్తువులు. అర్ధరాత్రి ఇళ్లలోకి చేరిన వరద నీరు. మణుగూరులోని రోడ్లన్నీ జలమయం.. పొంగిపొర్లుతున్న కోడిపుంజుల వాగు, కట్టు వాగు. భద్రాద్రి జిల్లా.. ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు చెరువు. ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వర్టు పైనుంచి వెళ్తున్న వరద ఉదృతకి ప్రవాహంలో కొట్టుకుపోయిన సత్యనారాయణ పురానికి చెందిన పాషా. ప్రవాహంలో చెట్టును పట్టుకొని ఉన్న అతన్ని రక్షించిన స్థానికులు.

ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగా ఉదృతి

ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగా ఉదృతి పెరిగింది. జైనథ్ మండలంలో ఉప్పొంగి పెనుగంగా నది ప్రవహిస్తుంది. అనంద్ పూర్ వద్ద బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న పెనుగంగా. తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది.

విజయవాడ-చత్తీష్ఘట ఘడ్ జాతీయ రహదారి పై వరద

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కుండపోత వర్షం కురుస్తుంది. విజయవాడ-చత్తీష్ఘట ఘడ్ జాతీయ రహదారి పై వరద పోటెత్తింది. బయ్యన్నగూడెం,తుమ్మలపల్లి, కుప్పెనకుంట్ల గ్రామాల వద్ద జాతీయ రహదారి పై ప్రవహిస్తున్న వరద నీరు. విజయవాడ వైపు నుండి భద్రాచలం వైపు నిలిచిన రాకపోకలు. విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే వాహనాలను ముత్తగూడెం వద్ద మళ్ళించారు అధికారులు.

ఇందల్వాయి వద్ద ఉదృతంగా లింగాపూర్ వాగు ప్రవాహం..

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద ఉదృతంగా లింగాపూర్ వాగు ప్రవహిస్తుంది. ఇంధల్వాయి దర్పల్లి మధ్య రోడ్డు మూసివేశారు అధికారులు. రాకపోకలకు అనుమతి నిలిపి వేసిన పోలీసులు. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అత్యవసర సహాయ సిబ్బందిని ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు.

దాల్మల్ కుంట చేరువుకు బుంగ..

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి దాల్మల్ కుంట చేరువుకు బుంగ ఏర్పడింది. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది.

పెద్దపల్లి జిల్లా కడెం నుంచి భారీగా వరద

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కడెం నుంచి భారీగా వరద నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. ఇన్ ఫ్లో 83 వేల 521 క్యూసెక్కులు కొనసాగుతుంది. ఔట్ ఫ్లో 1 లక్ష 23 వేల క్యూసెక్కులు కాగా.. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా కొనసాగుతుంది. ప్రస్తుత నిల్వ 18.7 టీఎంసీ లు.ప్రాజెక్ట్ కు సంబంధించిన 20 గేట్లు తెరచి 1 లక్ష 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నది పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

మహబూబాబాద్ జిల్లాలో తెగిన చెరువు కట్టలు..

మహబూబాబాద్ (మ) అయోధ్య గ్రామంలో చెరువు కట్ట… తెగి గ్రాంలోకి నీరు చేరింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో భారీ వర్షం రావిరాల గ్రామంలోని చెరువు నిండి మత్తడి పోయడంతో రాత్రి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది దింతో ఇంటి స్లాబ్ పైకి ప్లాస్టిక్ పరదాలు కప్పుకున్న బాధితులు, సహాయంకోసం ఎదురుచూస్తోంది వరదలో కొట్టుకపోయిన ఇంటి ముందు పెట్టిన బైకులు ఆటో కార్లు మూగజీవాలు 200 గోర్లు వరదలు కొట్టుకపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది జలదిగ్బంధంలో రావిరాలా,మదనతుర్తి గ్రామ శివారు టేక్య తండా తండాలోని సుమారు 30 ఇండ్లలోకి చేరడంతో ఇంటి స్లాపు పైకి ఎక్కిన తల దాచుకున్నరు బాధితులు. రాత్రి ఒంటి గంట నుండి ఇంటి స్లాబ్ పై బిక్కు బిక్కు మంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

లెవెల్ బ్రిడ్జి పైనుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద

ఇక రావిరాల లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వరదకు మహబూబాబాద్ తొర్రూరుకు నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ, గంగారం మండలాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోక లు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల తో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. ఇంటికన్నె …. కేశముద్రం రైల్వే స్టేషన్లో సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నంతో పలు రైలు వివిధ స్టేషన్లో నిలిచిపోయాయి సికింద్రాబాద్ ఖమ్మం రోడ్ లో 30 ట్రైన్లు ఎఫెక్ట్ అయ్యాయి వరంగల్ సమీపంలో నిలిచిపోయినని కాజీపేట స్టేషన్ కి తరలించి డైవర్ట్ చేస్తున్నారు భారీ వర్షాలతో నిలిచిపోయిన రైళ్ల వివరాలతో పాటు రైలు ప్రయాణికుల ఇబ్బంది పడుతున్నారు.

ములుగు పొంగుతున్న జలగలంచ వాగు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోవిందరావుపేట మండలాల మధ్య ఉన్న జలగలంచ వాగు పొంగడంతో వాహనరాకపోకలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. అదేవిధంగా నూగూరు వెంకటాపూర్ మండలంతో పాటు తా డ్వాయి మండలంలో ప్రధాన రహదారి పై చెట్లు కూలడంతో రాకపోకలు నిలిచి పోయాయి. భారీ వర్షాల కారణంగా తొలగించడం వీలుకాకపోవడంతో ప్రజ లు ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లా.గోవిందరావుపేట మండలంలో గుండ్ల వాగు, దయ్యాలవాగు ఉదృతంగా ప్రవ హిస్తుండటంతో వాగుల పరివాహక ప్రాంతాలల్లోనివందలాది ఎకరాల భూములు నీట మునిగాయి. వాగుల ఉదృతితో మేడారం వద్ద జంపన్నవాగు బ్రిడ్జి దాటి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాలప్రజలకు వరద ముంపు ఉం దని అధికారులు ప్రజలను అప్రమత్తంం చేశారు. ములుగు మండలంలోని బొగ్గు లవాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో జగ్గన్నగూడెం, అంకన్నగూడెం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి.

భూపాలపల్లి జిల్లాలోని ఉదృతంగా మోరంచ వాగు, చలివాగు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మోరంచ వాగు, చలివాగు ఉదృతంగా ప్రవహిస్తున్నది. వరంగల్ జిల్లా లోని పాకాలవాగు, ఆకేరు, మున్నే రు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మరోరెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ చెప్పడంతో ఇటు ప్రజల్లోను, రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదృతంగా వాగులు, వంకలు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో వర్ష దంచి కొడుతోంది రెండు రోజులుగా కురుస్తునం వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న వాగు లు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. హనుమకొండ -ఏ టూర్నగారం 163వ జాతీయ రహ దారిపై వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాహానాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని లోతట్టుప్రాతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్క డికక్కడిగా జిల్లా కేంద్రాలల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేసి ఎప్పటికప్పడు వరద సమాచారం, వర్ష సమాచారం తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలోని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే నగరంలోని భద్రకాళీ, వడ్డేపల్లి చెరువులు మత్తడి పడుతుండటంతో వరదముంపు పొంచి ఉన్నదని లోతట్టు ప్రాంతాల ప్రజలను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదాదేవి, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అప్రమత్తం చేశారు.

బొంది వాగులోకి పెద్ద మొత్తంలో వరద నీరు

ఇక గ్రేటర్ వరంగల్ లోను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న బొంది వాగులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్ సాయి నగర్ కాలనీవాసులను అప్రమత్తం చేసిన వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అలుగుపారుతున్న భద్రకాళి జలాశయం నగరంలోని లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసిన వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు ఎన్టీఆర్ నగర్ ,ఎస్ ఆర్ నగర్, MH నగర్ ,డీకే నగర్, కాలనీవాసులను అప్రమత్త చేయడంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన వరంగల్ మహా నగర పాలక సంస్థ భారీ వర్ష సూచన నేపథ్యంలో వరంగల్ తాసిల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఉమ్మడి జిల్లాలోని మంగపేట 9.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు శనివారం ఉదయానికి ఉమ్మడిజిల్లాలో అత్యధికంగా మంగపేట మండలంలో – 9.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైం ది. గోవిందరావుపేట మండలంలో 8.3 సెంటిమీటర్లు, ఏటూర్నాగారంలో 8 సెంటిమీటర్లు, వెంకటాపూర్లో 6.7, ములుగు వెంకటాపూర్లో 5.1, ములు గులో 4.7 సెంటిమీటర్లు ఉండగా, దుగ్గొండి మండలంలో 8.8. నల్లబెల్లిలో 7.6, ఖానాపురం, చెన్నరావుపేటలో 6.6 – సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. = కొత్తగూడ మండలంలో 8.8 సెంటి – మీటర్లు, డోర్నకల్లో 8.9 సెంటిమీటర్లు, గంగారం, మహబూబాబాద్, గూడూ రు, మరిపెడ మండలాల్లో 7.2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. బయ్యా రం, గార్ల, కురవి మండలాల్లో 6.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది,. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండ టంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాల కారణంగా ప్రజలు బయటకు వెళ్లకుండా ఇండ్లకే పరిమితమయ్యారు.

శుక్రవారం సాయంత్రం నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షా లతో ఇటు వాగులుపొంగి గోదావరిలో కలవడంతో పాటు అటు ఎగువ ప్రాంతా ల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి క్రమంగా పెరుగుతున్నది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపా కులగూడెం వద్ద సమ్మక్కసాగర్కు 2,15,320 క్యూసెక్కుల వరదనీరుఇన్ ప్లోగా వస్తుండగా, ప్రాజెక్టు ఉన్న 59 గేట్లు ఎత్తి 2,15,320 క్యూసెక్కులనీటిని కిందికి వదులుతన్నారు. ఏటూర్ నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద శనివారం సాయంత్రం వరకు 10.28 మీటర్లకు చేరుకున్నది.
Telangana Rains: తెలంగాణకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు..