TG Rain Alert: భారీ వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Read also: Minister Sridhar Babu: మంథని వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మేడ్చల్ జిల్లా గుండ్లపొచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ మరోసారి నీట మునిగింది. మైసమ్మగూడలోని చెరువు నాలా ఆక్రమణకు గురికావడంతో నాలా నుండి పారాల్సిన వరద నీరు రోడ్లపై పారడంతో పలు హాస్టళ్లు, సెల్లార్లలోకి, ఇళ్లలోకి వర్షపు నీరు అడుగుమేర చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మల్లారెడ్డి యూనివర్సిటీలో చదివే విద్యార్థులు, స్థానిక ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా వరద నీరు రోడ్లపై పారుతున్నా ఏ ఒక్క అధికారి, నాయకులు మైసమ్మగూడను సందర్శించలేదని స్థానికులు మండిపడ్డారు. శాశ్వత నాలా నిర్మాణం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
Medaram Forest: మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం.. 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం..