NTV Telugu Site icon

Prajavani: గాంధీ భవన్ లో ఇవాళ ప్రజా వాణి.. హాజరు కానున్న మంత్రి ఉత్తమ్ కుమార్..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Prajavani: గాంధీ భవన్ లో ఇవాళ ప్రజా వాణి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇవాళ నీటిపారుదల, పౌరసరఫరాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకాన్నారు. ఇవాల ఉదయం నుంచి మధ్యాహ్నం 2 వరకు గాంధీ భవన్ లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. వారానికి (బుధ, శుక్ర) ఇద్దరు మంత్రులు తప్పకుండా గాంధీ భవన్ కి హాజరుకావాలనే నేపథ్యంలో మొదటి రోజు (బుధవారం) ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కాగా.. రెండో రోజు (శుక్రవారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. అనంతరం వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించనున్నారు.

Read also: Reasi Bus Terror Attack : రియాసి బస్సుపై దాడి కేసులో అనేక చోట్ల ఎన్ఐఏ దాడులు

ప్రజావాణి కార్యక్రమంలో మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి కానీ.. అది తప్పనిసరి కాదు కాబట్టి మంత్రులు కార్యక్రమానికి హాజరు కావడం అరుదుగా మారింది. అది కాస్త ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, మంత్రుల మధ్య దూరం పెరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. దీంతో వారంలో రెండు రోజులు బహిరంగ విచారణకు మంత్రి హాజరయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించి… వారంలో రెండు రోజులు ఓ మంత్రి తప్పనిసరిగా బహిరంగ విచారణకు హాజరుకావాలని సూచించారు. దీనికి తోడు ప్రజావాణిపై రోజురోజుకూ నెగెటివ్ ఇంప్రెషన్ పెరిగిపోవడంలో మంత్రులు చొరవ తీసుకోవాలని, ప్రజావాణిలో పాల్గొని ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తీసుకురావాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి మంత్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రతి బుధ, శుక్రవారాల్లో జరిగే ప్రజా వాణి కార్యక్రమంలో మంత్రి తప్పకుండా పాల్గొంటారు. ఈ సంప్రదాయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మొదటగా ప్రారంభించి బుధవారం ప్రజా సమస్యలు తెలుసుకున్న విషయం తెలిసిందే..
Mahabubabad Crime: మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య..