Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ పైర్ అయ్యారు. హైదరాబాద్ నగరానికి ఏం చేశారు అదే సరూర్ నగర్ సభలో చెప్పాలని సవాల్ విసిరారు. 11 సంవత్సరాల్లో తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో బీజేపీ చెప్పాలన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సరూర్ నగర్ లో మీటింగ్ పెడుతున్నారని అన్నారు. ఈ చార్మినార్ చారిత్రాత్మక వేదిక నుండి అడుగుతున్న కిషన్ రెడ్డి గారు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు తెలంగాణకు ఏం తెచ్చారు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అంటే చెరువులకు రాక్ సిటీ అని మంత్రి అన్నారు.
Read also: Ganja Smuggling: ఏం ఐడియా రా బాబు.. కుటుంబంగా ఏర్పడి కారులో గంజాయి విక్రయం..
అర్జియాలజి మరియు టూరిజం మంత్రిగా మీ ముద్ర ఏది? అని కేంద్ర మంత్రిని మంత్రి పొన్నం ప్రశ్నించారు. మీరు హైదరాబాద్ నగరానికి ఏం చేశారు అదే సరూర్ నగర్ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలు తెలంగాణకి ఏమి ఇవ్వక గత ప్రభుత్వం అడగలేదనే నెపంతో దాటవేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న తమ ప్రభుత్వం కేంద్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణకు సహకరించాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా.. మొన్న వరదలు వచ్చినప్పుడు నష్టపరిహారం ఇవ్వకుండా.. తెలంగాణ పై వివక్ష చూపించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నెరవేరుస్తున్నామన్నారు.
Bihar: బీహార్‌లో ఆందోళనకు దిగిన పోటీ పరీక్షల అభ్యర్థులు.. పోలీసుల లాఠీఛార్జ్!