Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయన్నారు. రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోందన్నారు. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైందన్నారు. విగ్రహం మార్పు పై ముఖ్యమంత్రి తో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది బోనాలకు ఘనంగా జరిగాయన్నారు. గోల్కొండ లో తోలి బోనం తో ప్రారంభమై..బల్కం పేట ఎల్లమ్మ బోనాలు.. ఉజ్జయిని మహంకాళి బోనాలు.. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో హైదరాబాద్ బోనాలు ముగుస్తాయన్నారు.
Read also: Rangam Bhavishyavani: రక్త పాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు..
ప్రభుత్వ యంత్రాంగం బోనాల ఉత్సవాలలో అత్యంత శ్రమపడి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన, ప్రజల అందరు సహకారం అందించారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఆలయానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గతం కన్నా ఎక్కువ నిధులు బోనాల పండుగకు మంజూరు చేశామన్నారు. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. భవిష్యవాణి లో అమ్మవారి చెప్పినట్లు వర్షాలు సంవృద్దిగా కురిసి.. ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలి అని అమ్మవారు చెప్పారన్నారు. అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం రేవంత్ రెడ్డి,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!