Rangam Bhavishyavani: రక్త పాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు..
- రంగం కార్యక్రమంలో మాతంగా స్వర్ణలత భవిష్యవాని..
- అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని భవిష్యవాణి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangam Bhavishyavani: రక్త పాశం ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు.. అంటూ రంగం కార్యక్రమంలో మాతంగా స్వర్ణలత భవిష్యవాని వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని భవిష్యవాణి పలికారు. 250ఏళ్లుగా లష్కర్ కి వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తున్నావ్. ఈ ఏడాది 16 రోజులుగా జాతర జరిపించుకున్నావ్. నీ ఆశీర్వాదం తెలుపు.. బలి కార్యక్రమం నచ్చిందా అమ్మ అనే అయ్యవారి ప్రశ్నకు.. అమ్మవారు మాట్లాడతూ.. రక్త పాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు. దానితోనే సంతోష పడుతున్నాను అన్నారు. ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. నన్ను కొలిచి నిండే నిలిచిన మహంకాళి నేను అని తెలిపారు.
Read also: YSRCP MLAs Black Scarves: నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు.. పోలీసులపై జగన్ ఫైర్..!
Also Read
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ప్రశ్న.. సమాధానాలు..
1. బోనాలు నీ పూజలో ప్రత్యేకం.. బోనాలు ఎవరు, ఎలా జరిపించాలి?
జ. ఏ బోనం అయినా, ఎవరు ఎతుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే. వెళ్ళు, వాళ్ళు తేవాలని సందేహం పెట్టుకోకండి. ఎవరు తెచ్చిన సంతోషంగా అందుకునే బాధ్యత నాది
2. వర్షాలు ఎలా కురుస్తాయి. పాడి పంటలు ఎలా ఆశీర్వదిసస్తావు. వ్యాధులు లేకుండా ఎలా చూస్తావ్?
జ. కోరినంత వర్షాలు వుంటాయి. మంచిగా చూసుకుంటాను. ఎటువంటి లోటు లేదు మీకు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండి. అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్ముకున్న వారిని కపడుకుంట
3. కోట్ల మంది ప్రజలు నీ దర్శనం చేసుకున్నారు. 48 గంటలు వర్షంలో తడిచి దర్శనం చేసుకున్నారు నీ తృప్తిని తెలియజేయి?
జ. నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరి పోతులు అవుతారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను
4. ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అమ్మ . నువ్వు ఏమి కోరుకుంటున్నావ్?
జ. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపం నేను పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా
Read also: Madhyapradesh : భూవివాదం, కుటుంబ కలహాలు.. మహిళలను సజీవ సమాధి చేసే ప్రయత్నం
5. ఇది నీ ఆశీర్వాదం కాదు . ఆజ్ఞగా భావించి ఆ కార్యక్రమంలో వుంటాం. నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తాం?
జ. నా గ్రామ ప్రజలు అందరికీ నేను సంతోషంగా ఉండటానికి సళ్ళని సాక పెడుతున్నారు. ఈ సారి కూడా 5 వారాలు పప్పు బెల్లలతో శాఖ పెట్టండి.
6. ప్రజలు వ్యాధులు, డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వారికి ని చల్లని చూపు కావాలి?
జ. చదువుని కానీ ఏటికేడు ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ .. పాడి పంటలు ఇదివరకు లాగా పండించడం లేదు. ఒషధాలు ఎక్కువ వాడుతున్నారు. అందుకే అనారోగ్యం. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయి
7. బలి కార్యక్రమం నచ్చిందా అమ్మ ?
జ. రక్త పాశం ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దానితోనే సంతోష పడుతున్నాను.
8. భక్తులను ఆదరించి, ఆశీర్వదించి తల్లి?
జ. సంతోషంగా ఘనంగా అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా వుండేలా చూసుకుంటాను
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!