NTV Telugu Site icon

Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..

Ponnam Prabhakar 12

Ponnam Prabhakar 12

Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి అవుతుందని.. నవంబర్ 6 వ తేది నుండి సమగ్ర సర్వే మొదలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంటు వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నారు. ఒక్క బిసీ నాయకుడికి బీఆర్ఎస్ పదవి ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ వారికి కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ కు ఏం ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఎవరికి భయపడ అవసరం లేదన్నారు. గతంలో ఏం మంత్రి కూడా దొరికేవారు కాదన్నారు. ఇప్పుడు మంత్రులు అందుబాటులో ఉంటున్నారన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.

Read also: CM Revanth Reddy: మీ ప్రకటనలో అపోహలు.. అవాస్తవాలు.. ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్..

కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కుల గణన సమగ్ర కుటుంబ సర్వే పై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమగ్ర కుల గణన ఇంటింటి సర్వే ఆవశ్యకత ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ జిల్లా కాంగ్రెస్ నేతలు కుల గణన చేసే ఎన్రోల్మెంట్ అధికారులతో ప్రతి ఇంటికి గడపకి వెళ్లి చెప్పాల్సిన అంశాల పై కార్యకర్తలకు వివరించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ పరిధిలో ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు ప్రతి అంశం పై మాట్లాడుకుందామని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు..సంబంధిత శాఖ మంత్రి గా కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తునన్నారని వెల్లడించారు.
Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Show comments