Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక లక్ష ఇండ్లు మాత్రమే కట్టిందని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదల ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు.. రెండు కళ్ళ లా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయం లో భూస్వాములకు ఉపయోగ పడేలా తీసుకున్న నిర్ణయాన్ని మార్చి.. పేదలకు ఉపయోగపడేలా ఈ భూమి మార్చి.. పరిశ్రమల ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకుందన్నారు. రైతును రాజును చేసేందుకు ఈ ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తుందన్నారు. రెవెన్యూ భూమిగా ఉండి రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే చేసి సాగు చేస్తున్న రైతులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో లో 3500 ఇండ్లు ఇస్తున్నాం.
Read also: Minister Seethakka: ములుగులో పరిశ్రమ ఏర్పాటు చేస్తాం..
భూపాల పల్లి జిల్లా కు ప్రత్యేక కోటా క్రింద ఇండ్లను ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక లక్ష ఇండ్లు మాత్రమే కట్టిందని తెలిపారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడుతలో 4 లక్ష యాభై వేల ఇండ్లను కట్టిస్తున్నామన్నారు. వెనక పడ్డా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధరణి వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడలేదట.. కోట్ల రూపాయల చేతులు మరలేదట.. రైతులు జనం నష్టపోలేదట అంటూ మండిపడ్డారు. ధరణి వల్లనే బీఆర్ఎస్ ఓటమి చెందింది అని ఇప్పటి గుర్తించలేదన్నారు. కేంద్రం లోని బీజేపీ కూడా అప్పటి ప్రభుత్వం తీరు పైనా నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: హైదరాబాద్‌లో విక్రయానికి లక్ష ఇళ్లు..గత ఐదేళ్లలో పెరిగిన ధరలు