New Year Celebrations: మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కడికెళ్లాలి, ఏం చేయాలి అనే కార్యక్రమాలను ఫిక్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా రిసార్టులు, హోటళ్లు, పబ్బులు, వ్యాపార సంస్థలు ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంతో ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు తమ పనిలో పడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే వివిధ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో ఈవెంట్‌ల నిర్వాహకులందరూ తప్పనిసరిగా పాటించాల్సిన పలు నిబంధనలను పోలీసులు వివరించారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
పోలీసుల రూల్స్..
* ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి
* వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం..
* ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్.
* పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరణ.
* డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు-పోలీసులు.
* తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6నెలలు జైలు.
* మైనర్లు వాహనం నడిపితే యజమానిపైన కేసు నమోదు
* ర్యాష్ డ్రైవింగ్‌పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు
Astrology: డిసెంబర్ 13, శుక్రవారం దినఫలాలు