NTV Telugu Site icon

Anchor Shyamala: ముగిసిన యాంకర్ శ్యామల విచారణ

Shyamalu

Shyamalu

Anchor Shyamala: ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల.. రెండున్నర గంటలకు పైగా శ్యామలను పోలీసులు విచారణ చేశారు. ఇక, విచారణ అనంతరం శ్యామల మాట్లాడుతూ.. విచారణ సమయంలో మాట్లాడటం సమంజసం కాదు అని పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాను.. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరు భర్తీ చేయలేరు.. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్‌లకు పాల్పడటం తప్పు అని ఆమె తెలిపారు.

Read Also: Local Body MLC Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ఇక, యాంకర్ శ్యామలతో పాటు ఈ రోజు విచారణకు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్​ ల ఆచూకీ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీతో పాటు పలువురు నటీమణులు సైతం ఉన్నారు. కాగా, ఇప్పటికే ఆదివారం నాడు టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారణ చేశారు.