Site icon NTV Telugu

మత్తులో జోగుతున్న బిజినెస్ మెన్ లు.. అడ్డంగా బుక్కయ్యారు..

డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ బిజినెస్ మెన్ లు డ్రగ్స్ కు అలవాటుపడ్డారు. ముంబై డ్రగ్ మాఫియా టోనీ తో వ్యాపారవేత్తలు నిత్యం డ్రగ్స్ తెప్పించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పాత బస్తీ కేంద్రం గా మసాలా దినుసులతో ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్రిడ్జి లను నిర్మిస్తున్న Aవన్ కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్, హైదరాబాదు తో పాటు ఆంధ్రా లో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్, పలు ప్రభుత్వ కాంట్రాక్టులు చేపట్టిన ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి లతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్న ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిరంజన్ జైన్, సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. వీరితో పాటు ప్రముఖ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారి వెంకట్ చలసాని, వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణలలో ప్రముఖ ఎక్స్పోర్ట్ గా చలసాని వెంకట్ కొనసాగుతున్నారు. భార్గవ్ , వెంకట్ లు కలిసి పార్టనర్స్ గా ఎక్స్పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రముఖులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం కలకలం రేపుతోంది.

Exit mobile version