NTV Telugu Site icon

PCC Chief Mahesh Goud: సీఎం రేవంత్ ‘‘ఒకే ఒక్కడు’’ పుస్తకం ఆవిష్కరించిన పీసీసీ చీఫ్..

Tpcc Mahesh Kumar Gude

Tpcc Mahesh Kumar Gude

PCC Chief Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డి పై రాసిన ఒకే ఒక్కడు పుస్తకాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కూమార్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తీ రేవంత్ రెడ్డి అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బంధాలతో పాలన చేస్తున్న కేసీఆర్ పైన పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రేపు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ చేసుకున్నామని తెలిపారు. ఒకే ఒక్కడు పుస్తకాన్ని రచించిన వేణుగోపాల్ రెడ్డి, విజయార్కేకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి నుంచి ముందుగా రేవంత్ రెడ్డికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని .. ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా.. రేపు (శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
CM Chandrababu: సోషల్‌ మీడియాలో పోస్టులపై సీఎం సీరియస్‌.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు..

Show comments