Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కాస్త ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. చర్లపల్లి జైలులో నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించిన న్యాయస్థానం ఇంటి భోజనానికి అనుమతించింది.
Read also: Emotional Scene: కంటతడి పెట్టించే సన్నివేశం.. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుళ్లు..
మరోవైపు రిమాండ్ లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులు తన పేరుతో బయటకు వచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు. కేటీఆర్ గురించి కానీ, ఈ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని, తాను ఏమీ చెప్పలేదు అని వెల్లడించారు. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితె రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు అని పేర్కొన్నారు. అప్పటి వరకు తనకు అందులో ఏముందో తెలియదు అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను పోలీసులకు చెప్పనిదే చెప్పినట్లు రాశారు అని కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
TG Weather: పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు..