Site icon NTV Telugu

Patnam Narender Reddy: పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..

Patnam Narender Reddy

Patnam Narender Reddy

Patnam Narender Reddy: లగచర్ల ఘటనలో అరెస్టయి చెర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని హైకోర్టు కొట్టివేసింది. ఇదే ఘటనపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారని పట్నం నరేందర్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిపై బొంరాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఒకే ఘటనపై వేర్వేరుగా కేసులు పెట్టకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ కోర్టులో ప్రస్తావించారు. దాడి ఆధారంగా వేర్వేరుగా కేసులు నమోదు చేశారని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. నరేందర్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం.. పులి దాడిలో మహిళ మృతి

Exit mobile version