NVSS Prabhakar: రేవంత్ రెడ్డి హామీలు మాత్రమే కాంగ్రెస్ కు హామీలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్ళడం పడిగాపులు కాయడం అలవాటయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కీలకమైన శాఖలు సీఎం చేతుల్లోనే ఉన్నాయి కానీ.. వాటి అధికారాలన్ని ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డిని అధిష్టానం ముప్పుతిప్పలు పెడుతోంది రేవంత్ రెడ్డి పాలనకు ఆటంకం కలిగిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి హామీలు మాత్రమే కాంగ్రెస్ కు హామీలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందన్నారు. దీపదాస్ మున్షీ ఒక రాజ్యంగేతరా శక్తిగా ఉండి నడిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం అవామానపరుస్తోంది.. అడ్డంకులు కల్గిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ, ఉత్తం కుమార్ రెడ్డి, కేసీఆర్ మధ్యలో రాష్ట్రం నలిగిపోతోందన్నారు.
Read also: Gadwal Politics: హాట్ హాట్ గద్వాల్ రాజకీయాలు.. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలం అయ్యింది, ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. ఢిల్లీలో పడిగాపులు కాయడం కంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే మంచిదని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారంకై ఇద్దరు సీఎంలు కలిస్తే తప్పు లేదని అన్నారు. చంద్రబాబుతో కలవడానికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి అనుమతి ఇచ్చిందా లేదా అనేది తెలియాలన్నారు. ఏ క్షణానైనా ఈ సమావేశం రద్దు కావొచ్చన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక ఉంటుందా లేదా అనే అనుమానం కలుగుతోందని తెలిపారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నారా… లేక ఢిల్లీ అధిష్టానం పరిపాలిస్తుందా..? అని ప్రశ్నించారు.
Minister Seethakka: పార్లమెంట్ లో అల్లూరి విగ్రహంపై కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి..