NTV Telugu Site icon

Telangana MLC: నేటి నుంచి 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ

Mlc

Mlc

తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఈనెల 20వ తేదీన పోలింగ్​జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది.