Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. గోషామహల్‌లో దాదాపు 32 ఎకరాల్లో పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని, అందుకోసం వెంటనే ఆ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు బదలాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పీడ్ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) కార్యక్రమంలో భాగంగా వివిధ అభివృద్ధి పనులపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. స్పీడ్ ప్లాన్‌లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంతో పాటు జిల్లాల్లో కొత్తగా 15 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల్ కళాశాలలు, సమాఖ్య భవనాల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
Read also: New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు..
ఇక…రాబోయే 50 ఏళ్ల అవసరాలను బేరీజు వేసుకుని కొత్త ఆస్పత్రికి రూపకల్పన చేయాలి. ఆస్పత్రికి నాలుగువైపులా రోడ్లు ఉండాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలి. ఆస్పత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు , నర్సింగ్ సిబ్బంది కోసం ఒక అకడమిక్ బ్లాక్ మరియు హాస్టళ్లు కూడా నిర్మించబడాలి కాంక్రీట్ భవనాలు, బహుళ అంతస్థుల భవనాలు ఆహ్లాదకరమైన విశాలమైన ప్రదేశంగా ఉండాలి. అన్ని వైద్య విభాగాలు, సేవలను కార్పొరేట్ పద్ధతిలో అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్‌లతో డిజైన్‌లు రూపొందించాలి. గోషా మహల్ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని పోలీసు శాఖకు కేటాయించాలి. జిల్లా కలెక్టర్ పేట్లబురుజులోని పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ మరియు సిటీ పోలీస్ అకాడమీ పరిసర ప్రాంతాలను సందర్శించాలి. గోషామహల్‌లోని పోలీసు స్టేడియం, క్రీడా ప్రాంగణాన్ని అక్కడికి తలరించేలా చూడాలన్నారు.
MLC Kavitha: నేడు హైదరాబాద్ రానున్న కవిత.. ఎన్ని గంటలకు అంటే..