New EV Policy In Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్నును కూడా 100 శాతం తగ్గిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఏడాదికి లక్ష రూపాయలు ఆదా అవుతుందని తెలిపారు. ఢిల్లీ మాదిరిగానే హైదరాబాద్ నగరంలో కూడా కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని నివారించేందుకే కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read also: Nitish Reddy Debut: పెర్త్ టెస్ట్.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయమే!
జీవో నంబర్ 41 ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ నేటి నుంచి (నవంబర్ 18) 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు చెల్లుబాటు అవుతుందని పొన్నం పేర్కొన్నారు.కొత్త ఈవీ విధానం ద్వారా ఆటో, రవాణా బస్సులకు అదనంగా 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జంటనగరాలు, జిల్లాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నామని.. మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న మూడు వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారన్నారు. త్వరలో అన్ని ఈవీ ఆర్టీసీ బస్సులు నగరంలో నడపనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై నగరవాసులు శ్రద్ధ వహించాలని సూచించారు.
Astrology: నవంబర్ 18, సోమవారం దినఫలాలు