NTV Telugu Site icon

Nagarjuna Sagar: సాగర్‌ కు భారీగా వరద.. 8 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల..

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో సాగర్‌కు జలకళ సంతరించుకుంది. సాగర్‌ కు భారీగా వరద చేరడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఈనేపథ్యంలో 8 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో తొలిసారిగా ఆగస్టు 5న క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించగా సాగర్‌కు వరద పోటెత్తడంతో సెప్టెంబర్‌ 19 వరకు కొనసాగింది. రెండు విడుతల్లో 435 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కావడంతో ఎన్‌ఎస్‌పీ అధికారులు బుధవారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. 16,200తో ప్రారంభించి క్రమంగా 8 గేట్లను ఎత్తి 64,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్ జలాశయానికి వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేపడతామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎడమ కాల్వ ద్వారా 6,022 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 6,253 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,907 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, ఎస్ఎల్‌బిసి ద్వారా 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు, జలవిద్యుత్ స్టేషన్లు, కాలువల ద్వారా 1,08,782 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నది. ఇన్ ఫ్లో 93,707 క్యూసెక్కులుగా నమోదవుతోంది.
KTR Meeting: కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ సమావేశం.. అనంతరం గ్రూప్ వన్ అభ్యర్థులతో మీట్..