NTV Telugu Site icon

Motkupalli Narasimhulu: ఎవరో ఏదో అన్నారని.. వెనక్కి తగ్గకండి రేవంత్ రెడ్డి..

Motkupalli Narasimhulu

Motkupalli Narasimhulu

Motkupalli Narasimhulu: 80 లక్షల మంది మదిగలం నీ వెనుకే ఉన్నాం.. శాశ్వతంగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు.. ఎవరో ఏదో అన్నారని.. వెనక్కి తగ్గకండి రేవంత్ రెడ్డి అని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. 77 ఏళ్ల తరువాత అణగారిన వర్గాలకు ఫలాలు అందనున్నాయన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఆగస్ట్ 1 నాడు మాదిగలకు.. మాదిగ ఉపకులాలకు స్వాత్యంత్రం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. 77 ఏళ్ల నుంచి మాదిగలకు స్వాత్యంత్రం రాలేదని అన్నారు. నాకు ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్ రాలేదని మొన్నటి వరకు భాద విపరీతంగా ఉందని తెలిపారు. సుప్రీం కోర్ట్ తీర్పు తరువాత స్వయంగా సీఎం అసెంబ్లీలో ప్రకటించిన తరువాత ఆనందపడ్డానని అన్నారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

A,B,C,D వర్గీకరణ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్న అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చింది.. జాతి అంత సీఎం వెంట ఉందన్నారు. సీఎం వచ్చి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం చాలా సంతోషం అన్నారు. రేవంత్ కు మేము అన్ని విధాలుగా రుణపడి ఉంటామన్నారు. రిజర్వేషన్స్ అమలు చేస్తే రేవంత్ కు చరిత్ర ఉంటుందన్నారు. 80 లక్షల మంది మదిగలం నీ వెనుకే ఉన్నాం.. శాశ్వతంగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండొచ్చన్నారు. ఎవరో ఏదో అన్నారని.. వెనక్కి తగ్గకండి రేవంత్ రెడ్డి అని తెలిపారు. భారత దేశానికి ఆదర్శవంతమైన సీఎంగా రేవంత్ ఉండబోతున్నారని తెలిపారు. మాదిగల జనాభా ప్రతిపాదికన ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకి ఇవ్వండి.. ఎవరిని నష్టపోకుండా చూడండని తెలిపారు.

Read also: Revanth Reddy Strong Counter: విగ్రహంపై చేయి వేసి చూడు.. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..

నాకు ఏ పదవి వద్దు.. నేను సీఎం వెంట కార్యకర్తగా పని చేస్తా అన్నారు. జరగబోయే గ్రూప్స్.. టీచర్ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్స్ అమలు చేయండన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా దళిత నాయకుడు.. దళితులందరికీ భట్టి మద్దతు ఇవ్వాలన్నారు. రిజర్వేషన్స్ అమలు చేయడానికి రేవంత్ కు భట్టి అండగా నిలవాలన్నారు. మాదిగ జాతి అంత కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడటానికి సిద్ధంగా ఉందన్నారు. రిజర్వేషన్స్ అమలు చేయడానికి మాల సోదరులు సహకరించాలని కోరుతున్నానని అన్నారు. మంద కృష్ణ మాదిగను కూడా రేవంత్ కు సపోర్ట్ గా తీసుకువస్తామన్నారు. రిజర్వేషన్స్ పై ఆర్డినెన్స్ ను వెంటనే రేవంత్ సర్కార్ తీసుకురావాలన్నారు. ఎనభై లక్షల మంది మాదిగలను హైదరాబాద్ కు తీసుకువచ్చి సభ పెడుతామన్నారు. మాదిగ జాతికి రేవంత్ పెద్ద మాదిగ అన్నారు.
Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. రూ.2కోట్ల అప్పులు చేసిన వైనం

Show comments