Site icon NTV Telugu

Mohan Bhagwat: హిందూ ధర్మ హితమే.. .రాష్ట్ర హితం..

ఈ దేశంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలు ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే… హిందువుల ముందు నిలబడే సామర్థ్యం ఎవరికి లేదని వ్యాఖ్యానించారు ఆర్‌ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌… హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్య మిలీనియం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం సనాత ధర్మంలో అన్ని ఉన్నాయి. దేశంలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మనం ఎవరో మనం మరిచిపోయాం అంతే.. ఇప్పుడు ప్రతి హిందువు ఇదే మరిచిపోయాడు. తనలోని బలం ఏంటో తనకు తెలియదు. హిందూ సమాజం ఎవరితో గొడవ పడదన్నారు..

Read Also: MP Reddeppa: దేశానికే సీఎం జగన్‌ రోల్‌ మోడల్‌..!

ఇక, రామానుజ విగ్రహ ఏర్పాటుతో భాగ్యనగరం పేరుకు సార్థకత వచ్చిందన్న ఆయన.. ఈ దేశంలో మనమే (హిందువులు) 80 శాతం ఉన్నాం.. ఈ దేశంలో రాజకీయ
పార్టీలను, ప్రభుత్వాలు ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే అన్నారు.ఇవాళ రామ మందిరం నిలబడుతుంది.. హిందువుల ముందు నిలబడే సామర్థ్యం ఎవరికి లేదన్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్… ఎవరు హిందూ ధర్మాన్ని దెబ్బతీయలని ప్రయత్నం చేసరో వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.. హిందూ ధర్మ హితమే.. .రాష్ట్ర హితం అంటూ వ్యాఖ్యానించారు..

https://www.youtube.com/watch?v=lSY3tDEEXcA
Exit mobile version