Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం సికింద్రాబాద్, తిరుమలగిరి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, బాచుపల్లి, తార్నాక, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడగా, బయటకు వచ్చిన నగరవాసులు అవస్థలు పడ్డారు.
Read also: Mahesh Kumar Goud: జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు..
ఉదయం హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో మంచు దుప్పటిలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అల్వాల్, చిలకలగూడ, జవహర్ నగర్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో వర్షం కురిసింది. యాదాద్రిలో రోజంతా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి కూడా పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా చలి తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ఏదో ఒక చోట వర్షం కురుస్తుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
Read also: Jagga Reddy: ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో చాటి చెప్పిన మహనీయుడు మన్మోహన్ సింగ్
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం బలహీనంగా మారిందని తెలిపింది. దీని కారణంగా 1.5 కి.మీ మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని,అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలోని అన్ని ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశామని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
KCR: మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు..