MLC Kavitha: హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మూసీ అభివృద్ధికి మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ద్వారా డీపీఆర్ రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు శాసనసభలో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మూసీ నది గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్ళంతట వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతోందన్నారు.
Read also: Minister Sridhar Babu: ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుంది..
ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 181 కుటుంబాలు తమంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది… ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. కూలగొట్టిన ఇళ్లకు ఉంటే ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా ? అని ప్రశ్నించారు. మూసి నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోందన్నారు. కానీ 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం మాకు ఉందని అన్నారు. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా ? అని కవిత ప్రశ్నించారు.
Read also: Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..
డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పిందన్నారు. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించిందని మండలిలో ప్రశ్నించారు. మూసి కోసం రూ 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారన్నారు. ఒకవేళ కేంద్రాన్ని సాయం కోరిన, ప్రపంచ బ్యాంకు సహాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు ? సభను తప్పదోవ పట్టిస్తే అవసరమైతే… ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెడుతామన్నారు.
Bhatti Vikramarka vs Harish Rao: అసెంబ్లీలో హరీష్ రావు vs మల్లు భట్టి విక్రమార్క