NTV Telugu Site icon

MLC Kavitha: నేడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ.. వర్చువల్‌ గా హాజరుకానున్న కవిత..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు వర్చువల్‌గా హాజరుకానున్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై న్యాయమూర్తి కావేరీ బవేజా విచారణ చేపట్టనున్నారు. గత విచారణలో నిందితులకు సీబీఐ ఇచ్చిన చార్జిషీటు కాపీలు సరిగా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తమకు అందజేసిన చార్జిషీటు కాపీల్లో చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు కోర్టుకు తెలిపారు. సరైన పత్రాలను అందించాలని రౌస్‌ అవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణలో ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరుకానున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో గత 2 ఏళ్లుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియాకు, కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కొద్దిరోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చారు. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు.
Telangana MLA: ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అర్థరాత్రి న్యూడ్ వీడియో కాల్..