NTV Telugu Site icon

Jagadish Reddy: ప్రజా సమస్యలను చర్చించడానికి భయమేస్తుంది..

Minister Jagadish Reddy

Minister Jagadish Reddy

Jagadish Reddy: ప్రజా సమస్యలను చర్చించడానికి భయమేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శాసన సభలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటేనే అందరి మాటలను వినేట్టు ఉండటమని గుర్తు చేశారు. ప్రజలకు సంబంధించిన అవకతవకల గురించి చర్చించడమే ఈ సభ యొక్క ఉద్దేశ్యం అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియాలనేది బీఆర్ఎస్ ఉద్దేశ్యం అన్నారు. ప్రభుత్వం ప్రజలను హింస చేస్తుంది.. మేము ప్రజలకు అండగా ఉన్నామన్నారు.

Read also: Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..

లగచర్ల రైతులకు బేడీలు వేస్తూ హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారని తెలిపారు. సభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే పారిపోతున్నారని తెలిపారు. స్పీకర్ గా కూర్చున్నపుడు కాంగ్రెస్ తరపు వారని మరచిపోవాలన్నారు. స్పీకర్ కాంగ్రెస్ పక్షపాతిగా ఉండటం కరెక్ట్ కాదన్నారు. మాదాక వచ్చేసరికి వాయిదా వేయడం కరెక్ట్ కాదని తెలిపారు. ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చిన సంగతి లేదని అన్నారు. లాగచర్ల బాధితులకు అండగా ఉంటామన్నారు. అసెంబ్లీ నడిచినన్ని రోజులు లగచర్ల భాదితులు తరుపున పోరాడడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు.
Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్‌కు ఐసీసీ షాక్.. ఇక బౌలింగ్ చేయకూడదు!

Show comments