Arekapudi Gandhi:ఒక్కో ఎమ్మెల్యే మెల్లగా బీఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నారు. రోజు రోజుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాష్ గౌడ్ కు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 10గంటలకు జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు.
Read also: ZIM vs IND 4th T20I: నేడు జింబాబ్వేతో భారత్ నాలుగో టీ20.. మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే..!
గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అరికెపూడి గాంధీ. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని భావించిన్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే… ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరే తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఇప్పటిలోపు చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రిజిస్టర్ ని బంధించిన విద్యార్థులు..