Site icon NTV Telugu

Minister Seethakka: గుమ్మడికాయ దొంగ అంటే.. బీఆర్ఎస్ భుజాలు తడుముకుంటుంది..

Minister Seetakka

Minister Seetakka

Minister Seethakka: గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై శాసన మండలిలో మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. జరుగుతున్న ఘటనలపై మాకు అనుమానాలు ఉన్నాయి.. బయటకు తీస్తామన్నారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే టిఆర్ఎస్ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. మాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తెలుసు.. టిఆర్ఎస్ వాళ్ళ లాగా యాక్టింగ్ రాదన్నారు. బీఆర్ఎస్ నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడితే నిలువెల్లా అహంకారమే కనిపిస్తోందని తెలిపారు. ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచాం, 16 ఏండ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను పెంచామన్నారు.

Read also: One Nation One Election Bill Live UPDATES: లోక్‌సభలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చ లైవ్ అప్డేట్స్

మా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. హాస్టల్ సిబ్బందితోపాటు సప్లయర్లపై నిఘా పెడతామన్నారు. మీ పాలనలో 70 ఘటనలు, 5024 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారన్నారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన శైలజను బతికించేందుకు కష్టపడ్డామన్నారు. నిమ్స్ లో శైలజను మంత్రులు, సీఎంవో సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. మీ హయాంలో నిరుద్యోగులు చనిపోతే తల్లిదండ్రులకు శవాలను కూడా చూపించలేదన్నారు. మీ హయాంలో గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. మీ హయంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన అధికారి.. పదవికి రాజీనామా చేశాక మీపై ఎన్నో ట్వీట్స్ చేశారని మంత్రి సీతక్క గుర్తుచేశారు.
Bhatti Vikramarka vs Harish Rao: అసెంబ్లీలో హరీష్ రావు vs మల్లు భట్టి విక్రమార్క

Exit mobile version