NTV Telugu Site icon

Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కనకదుర్గమ్మ దర్శనానంతరం వేద పండితులు పొన్నం ప్రభాకర్ కు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు మంత్రికి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం ఎంతో సంతోషదాయకం అన్నారు. కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదని అన్నారు. ప్రతీ 150 ఇళ్ళకీ ఒక ఎన్యూమరేటర్ ఉంటారని తెలిపారు. కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలని అన్నారు. కులగణన మీద అందరూ పలు విధాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేం కులగణన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Read also: Medak Crime: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి..

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఈనెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందరి ఏకాభిప్రాయంతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు..

Show comments