NTV Telugu Site icon

Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా ఇవ్వొద్దు..

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్‌ అప్లికేషన్‌ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు. పార్టీలకు అతీతంగా ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఎవరూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్క పైసా ఇవ్వొద్దని తెలిపారు. మేము ఏ గ్రామంలో వెళ్లిన ఇందిరమ్మ ఇండ్లు చూపిస్తూ మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారన్నారు. గత ప్రభుత్వం లక్షా 62 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తామని టెండర్లు పిలిచి.. కేవలం 62 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారని మంత్రి పొంగులేటి విమర్శించారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరు పేదలను విస్మరించిందని మంత్రి తెలిపారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 లక్షల 56 వేల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టామని క్లారిటీ ఇచ్చారు. మిగిలిన ఇండ్లను ఇందిరమ్మ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. పేద వాడి చిరు ఆశ.. చివరి ఆశ ఇండ్లు అని మంత్రి తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇండ్లు, ప్రతీ ఇంటికి రూ.5 లక్షల రూపాయలు, 400 చదరపు అడుగుల ఇండ్లు ఇస్తామన్నారు. నాలుగు విడతల్లో ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రజాపాలనలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయన్నారు. రేపటి నుంచి ప్రతీ గ్రామానికి అధికారులు వెళ్లి సర్వే చేస్తారన్నారు. ఎవరు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్క పైసా ఇవ్వొద్దని మంత్రి తెలిపారు. అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం.. పార్టీలకు అతీతంగా ఇండ్లు ఇస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
Revenue Sadassulu: రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా..

Show comments