Minister Komatireddy: జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్న మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చేవారం మన్నెగూడ పనులు ప్రారంభించండి.. మనం ప్రజల కోసం, రైతుల కోసం పని చేస్తున్నాం – కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు అని ఆయన తెలిపారు. పనులు చేయని కాంట్రాక్టర్లను ఫోర్ క్లోజ్ చేయండి అని సూచించారు. పనులు జరుగుతున్న రోడ్ల వద్దకు వచ్చి జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Read Also: Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్
ఇక, కట్టే విరగదు – పాము చావదు అన్నట్టు వ్యవహరిస్తే ఇంకా పదేండ్లైన ఒక్క రోడ్డు వేయలేం అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. భూసేకరణకు డబ్బులు ఇవ్వండి – కలెక్టర్లతో కలిసి వేగంగా భూసేకరణ చెయ్యండి తేల్చి చెప్పారు. అలాగే, పంటల సీజన్ మొదలైతే భూసేకరణ సాధ్యం కాదని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 400 అర్బిట్రేషన్ కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి?.. అవార్డు ప్రకటించిన పనులు చేయకపోతే ఎలా అంటూ అధికారులను ప్రశ్నించారు. సీఎంతో సమీక్షించే నాటికి పనుల్లో పురోగతి ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.