Minister Jupally: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా? అనే వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా మండపడ్డారు. ఎమ్మెల్యేలను సిగ్గుందా అని కేటీఆర్ అనడం దారుణమన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినా, మీరు సిగ్గులేని పనులు ఎన్నో చేశారని ఆరోపించారు. చెప్పులు మోసే సంతోష్ రావుకు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు మీకు సిగ్గురాలేదా?.. వేల కోట్లు అక్రమార్జన చేశారని కవితే చెప్పింది కదా.. ఆమె ఏం లేకుండా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. కవిత, కేటీఆర్ ఇద్దరూ ఒకటే.. సిగ్గుశరం అనే పదం వారందరికీ వర్తించాలని మంత్రి జూపల్లి అన్నారు.
Read Also: IND vs PAK: ఈ క్రేజ్ వేరే లెవల్ అయ్యా.. రూ.4 లక్షల ప్రైజ్ టికెట్స్ కూడా సోల్డ్ అవుట్!
అలాగే, ఈ ప్రభుత్వం ఇవాళో, రేపో కూలిపోతుందని కేటీఆర్ అన్నారు?.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ఆలోచన ఆయనది.. 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను మీరే తీసుకున్నది నిజం కాదా?.. ఎమ్మెల్యేలు పనుల కోసం మాత్రమే వెళ్లారు, పార్టీలో చేరితే పనులు అవుతాయని చెప్పింది కేటీఆర్ అని మంత్రి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదైనా స్పీకర్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకుంటారు.. నేను ఏడు సార్లు పోటీ చేశాను, కానీ ఏ వేదికపైనా హామీలు ఇవ్వలేదు.. అయినా పనులు చేశాను.. దాన్ని పక్కనబెట్టి, కేటీఆర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు.
Read Also: Bengaluru: మెట్రోలో పరుగులు పెట్టిన గుండె.. రెండోసారి కూడా సక్సెస్
ఇక, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకు కేటీఆర్ సిగ్గుపడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు. ఫిరాయింపులపై నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాస్తవాలకు, బూతులకు తేడా తెలియని వ్యక్తి నువ్వు అని కేటీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరానని, రాష్ట్రం వెనక్కి పోకుండా నిలబడాలని అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నానని, తిరిగి కాంగ్రెస్‌లో చేరడం తప్పు కాదన్నారు. ప్రతి విషయానికి ఒక సమయం, సందర్భం అనేది ఉంటుంది అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు.
