NTV Telugu Site icon

Manda Krishna Madiga: నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండే ప్రచారమే..

Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna Madiga: నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండే ప్రచారమే అని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇవ్వడం ఆపుకోండన్నారు. మనం అంతా ఏకం కావాలి అన్ని వర్గాలకు అండగా సమానంగా పోరాడాలన్నారు. మాలల్లో అంబేడ్కరిస్ట్స్ లేరు.. అంబేడ్కర్ పేరు చెప్పుకుంటున్నారు అంతే అన్నారు. మాలల్లోనూ ఒకటి రెండు శాతం మంది నాకు సపోర్ట్ చేసే వాళ్లు ఉన్నారని తెలిపారు. మాలల్లో మనువాదులు పెరిగారు.. వాళ్లు విప్లవాలు చేసిన వారు కాదన్నారు. మాలల్లో ఎదిగిన మేధావులు.. రాజకీయ నేతలు అందరూ మనువాదులే.. వాళ్లు దేశ భక్తులు కాదని తెలిపారు. రోజు టీవీ చర్చల్లోకి వచ్చి మేమే మేధావులం అని చెప్పుకుంటున్న వాళ్లు అంతా.. మనువాదులే.. మాదిగ వ్యతిరేకులే.. అన్నారు. ఆనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉండే వారు.. కానీ ఇప్పుడు మాలల్లోనే మనువాదులు పెరిగారన్నారు.

Read also: KTR Comments: ఫార్మ్ హౌస్ ను నేను లీజుకు తీసుకున్నాను..

మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న మాలలకు నేను వ్యతిరేకంగానే పోరాడుతానని తెలిపారు. మాదిగలకు అండగా ఉండే వాళ్ల వెంట నేను ఉంటానన్నారు. నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండే ప్రచారమే అన్నారు. నేను పార్టీల్లో చేరుతున్నట్టు 1997 జూన్ లోనే ప్రచారం జరిగిందన్నారు. ప్రజల తరుపున పోరాటం చేయడానికే నేను ఉన్నానని.. నాడు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చాడు.. రాజ్యసభ ఇచ్చాడు.. వద్దన్నానని తెలిపారు. అప్పుడు టీడీపీలో చేరుతాను అనుకున్నారు.. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరుతాను అనుకున్నారు.. ఏ పార్టీలోనూ చేరలేదన్నారు. నల్ల కండువానే నా జీవితం.. దాన్ని నేను వదలనని తెలిపారు. ఎక్కడ ప్రజా సమస్య ఉన్న నా పోరాటం ఆగదన్నారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశాను ఓడిపోయాను.. కానీ ఏ పార్టీలో చేరలేదన్నారు. స్వతంత్రంగానే చట్టసభల్లోకి వెళ్లే అవకాశం ఉంటే వెళ్తాను.. నా స్వేచ్ఛను కోల్పోనని తెలిపారు.

Read also: Botsa Satyanarayana: ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం.. అభినందించిన జగన్‌

నేను ఏ పార్టీలోకి వెళ్లిన నన్ను చేర్చుకుంటారు.. పదవి ఇస్తారన్నారు. సాయంత్రం నేను సీఎం రేవంత్ ను కలవబోతున్నానని తెలిపారు. మా ఎమ్మెల్యేలు ఫోన్ చేసి రమ్మన్నారు..సీఎంను కలిసి ధన్యవాదులు చెప్తానన్నారు. దేశంలో అందరికంటే ముందు మేము వర్గీకరణ చేస్తామని రేవంత్ చెప్పారు.. కాంగ్రెస్ పార్టీలో మాల సోదరుల ఆధిపత్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన సరే ఓడిన సరే మాలలే సీట్లు ఇస్తుంది.. ఇక్కడ మూడు సీట్లుంటే కూడా మాదిగలకు ఒక్క
ఎంపీ టికెట్ ఇవ్వలేదన్నారు. నాడు కొండగల్.. మల్కాజ్ గిరిలో రేవంత్ కు నేను సపోర్ట్ చేశాను.. ఆయన కూడా ఇదే చెప్పారు..రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక మాదిగలకు సీట్లు తగ్గాయన్నారు. రేవంత్ ను నమ్ముతాను కానీ మల్లిఖార్జున ఖర్గేను నమ్మనని తెలిపారు. ఆయన చలవాది.. మాదిగ వ్యతిరేకి.. ఆయన వ్యతిరేకిస్తాడు.. వాళ్ల పార్టీ సీఎంలు స్వాగతిస్తారన్నారు.

Read also: Moto G45 5G Price: 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ.. 10వేలకే మోటో కొత్త 5జీ ఫోన్‌!

ఖర్గేను వదలను.. దేశ వ్యాప్తంగా ఆయన గురించి తేల్చుకుంటానన్నారు. ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో సిద్ధరామయ్య స్వాగతించాడు.. ఖర్గే వ్యతిరేకించాడన్నారు. వర్గీకరణ పై కాంగ్రెస్ స్టాండ్ ఏంటి.! ఖర్గే స్టాండ్ ఏంటో చెప్పాలి.! వర్గీకరణ పై రాహుల్ గాంధీ మాట్లాడకుండా ఖర్గే నోరు మూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఖర్గే.. రాహుల్ ను బ్రతిమిలాడం.. వర్గీకరణకు అనుకూలమైతే ఖర్గే.. రాహుల్ ఎందుకు మాట్లాడడం
లేదు.. వర్గీకరణను వ్యతిరేకిస్తే ఎన్నికల్లో హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. 2004 లో మేము నష్టపోవడానికి యూపీఏ ప్రభుత్వం కారణమన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్ట్ కు అఫిడవిట్ సమర్పించలేదు.. 2024లో మోడీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ సమర్పించిందన్నారు. సొలిసిటరీ జనరల్ ను పెట్టి వాదనలు విపించింది మోడీ సర్కార్.. వర్గీకరణకు మాకు సహకరించిన మోడీ.. అమిత్ షా.. కిషన్ రెడ్డికి ధన్యవాదాలన్నారు.
Tollywood: టాలీవుడ్ టుడే ఆప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…