NTV Telugu Site icon

Bomma Mahesh Kumar Goud: నేడు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

Bomma Mahesh Kumar Goud

Bomma Mahesh Kumar Goud

Bomma Mahesh Kumar Goud: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంటారు. గాంధీభవన్‌లో ఆయనకు కేటాయించిన రాష్ట్రపతి ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ గా మహేశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఇందిరాభవన్ ఎదుట బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం సందర్భంగా గాంధీభవన్‌ను ముస్తాబు చేశారు.

Read also: Flood Flow Reduced: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద..

అన్ని రంగులు వేయించి, కొత్త ఫర్నిచర్ వేయించి గాంధీభవన్‌ను ఏర్పాటు చేశారు. గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. శనివారం మధ్యాహ్నం సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గాంధీభవన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తు చేశారు. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో దాదాపు రెండు గంటలపాటు బస చేయనున్న నేపథ్యంలో పోలీసులు శనివారం సాయంత్రం నుంచి దాని పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Kerala: షాకింగ్ న్యూస్.. ఇడ్లీలు తింటూ వ్యక్తి మృతి..