Site icon NTV Telugu

Hyderabad: బీహెచ్ఈఎల్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు…

Cricket

Cricket

క్రికెట్ బెట్టింగ్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా బీహెచ్ఈఎల్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఓ ముఠా. వాట్సప్ కాల్స్ ఆధారంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ బృందం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసింది. పఠాన్ చెరువుకు చెందిన చిరంజీవి, కృష్ణ ను రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఓటీ టీం పట్టుకుంది. ఆర్గనైజర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 6 ఎకౌంట్స్ సీజ్ చేసి అందులో ఉన్న 2.55 లక్షలు ఫ్రీజ్ చేశారు అధికారులు. కేటుగాళ్లు ఇతర రాష్ట్రాలలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

Also Read:Extramarital Affairs: ఆయనకు నలుగురు, ఆమెకు ఐదుగురు పిల్లలు.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు..

దానికి మధ్యవర్తి వహిస్తూ హైదరాబాద్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ముఠా సభ్యులు. వాట్సాప్ కాల్స్ చేసి సమాచారం ఇస్తోంది ముఠా. ఎకౌంట్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తే పట్టుబడుతామని.. నేరుగా క్యాష్ కలెక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. గెలిస్తే నేరుగా క్యాష్ తీసుకొని బెట్టింగ్ ముఠా వారికి అంద జేస్తోంది. బెట్టింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తోంది ఎస్ఓటీ టీమ్. బెట్టింగ్ లో ముఖ్యమైన వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version