NTV Telugu Site icon

Ghatkesar: కారు దగ్ధం కేసులో ట్విస్ట్.. సజీవదహనం అయిన ఆ జంట ఎవరంటే..!

Ghatkesar

Ghatkesar

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం కారు దగ్ధమై ఇద్దరు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారులో ఉన్న జంట జీవదహనం అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం ప్రమాదశాత్తు జరిగింది కాదని పోలీసులు తేల్చారు. ఇద్దరూ ప్రేమికులని.. ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

శ్రీరామ్ (26), లిఖిత (16) గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో లిఖిత ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక శ్రీరామ్.. ఘట్‌కేసర్ నారపల్లిలో సైకిల్ షాపు నడుపుతున్నాడు. అయితే ప్రేమికులిద్దరూ రహస్యంగా ఉన్నప్పుడు చూసిన వ్యక్తులు.. శ్రీరామ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు శ్రీరామ్ తన సోదరికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇద్దరం చనిపోతున్నట్లు తెలిపాడు. అనంతరం ఘట్‌కేసర్‌లోని ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర కారులో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు 3 పేజీల నోట్‌ను స్వాధీనం చేస్తున్నారు. శ్రీరామ్ నడిపిస్తున్న సైకిల్ షాపు పక్కనే లిఖిత నివాసం ఉంటుంది. మృతులు ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Show comments