NTV Telugu Site icon

Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..

Telangana

Telangana

Telangana: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేశారు. సుమారు 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు. దీంతో దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్‌, భూపాలపల్లి, హుజూర్‌నగర్‌, భువనగిరిలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు భవన యజమానులు తాళాలు వేశారు. బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యజమానుల సంఘం డిమాండ్ చేసింది. మాబాధను అర్థం చేసుకోవాలని అందులో పేర్కొన్నారు.

Read also: World Students Day 2024: నేడు ప్రపంచ విద్యార్థి దినోత్సవం.. అబ్దుల్ కలాం జయంతి రోజునే ఎందుకు..?

తాళాలు వేసిన యాజమాన్యం..

యాదాద్రి జిల్లా: 9 నెలలు అద్దె బకాయి ఉండడంతో గురుకుల పాఠశాలకు భవన యజమాని తాళం వేశారు. మోత్కూర్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పాఠశాల బైయటే ఉపాధ్యాయులు, విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు.

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని, తాండూర్ మహాత్మ జ్యోతిబాపులే బాలుర పాఠశాల, వసతి గృహాలకు భవన యజమాని తాళాలు వేశారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న భవనాలకు 9 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో తాళాలు వేయాల్సి వచ్చిందని భవన యజమానులు తెలిపారు. ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని దీంతో తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు బిల్డింగ్ యజమాని దేవేందర్ రెడ్డి తాళం వేసిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఉపాధ్యాయులు సిబ్బంది స్కూల్ బయట వేచి చూస్తున్నారు.

Read also: Telangana Rain Alert: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. మూడ్రోజులు భారీ వర్షాలు..

మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు భవన యజమాని తాళం వేశారు. గత తొమ్మిది నెలలుగా బిల్డింగ్ కిరాయిలు ఇవ్వడం లేదని భవనానికి తాళం వేసినట్లు తెలిపారు. పాఠశాల బయటే గురుకుల పాఠశాల సిబ్బంది వేచి చూస్తున్నారు.

వరంగల్ జిల్లా: వరంగల్ ఉర్సు గుట్ట సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి భవన యజమాని తాళం వేశారు. దీంతో కళాశాల బయటే సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు నిరీక్షిస్తున్నారు. అద్దె బకాయిలు చెల్లిచాలని డిమాండ్ చేస్తూ భవనికి తాళం వేసిన బిల్డింగ్ యాజమాన్యం తెలిపారు. దసరా సెలవుల తరవాత పునర్ ప్రారంభమయ్యాయి. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాఠశాలలకు చేరడంతో బయట తాళం వేసి వుండటాన్ని గమనించి భవన యజమానికి విషయం తెలియజేశారు. దీంతో భవన యాజమానులు బాకాయిలు చెల్లించాలని అప్పటి వరకు బిల్డింగ్ తాళం తీసే ప్రశక్తే లేదని వెల్లడించారు.
Posters in Jagtial: ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. జగిత్యాలలో పోస్టర్ల కలకలం..