NTV Telugu Site icon

Hydraa Update: కూకట్ పల్లి, అమీన్ పూర్.. హైడ్రా అప్డేట్ ..

Hyd

Hyd

Hydraa Update: హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, అమీన్ పూర్ లో మరోసారి హైడ్రా బుల్డోజర్లకు పనిచెప్పింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే కూకట్ పల్లి నల్ల చెరువు వద్ద కూల్చివేతలు పూర్తయ్యాయి. నల్ల చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 16 అక్రమ వ్యాపార సముదాయాలను నేలమట్టం చేసింది. జనాలు ఉంటున్న ఇళ్లను హైడ్రా కూల్చకుండా వదిలేసింది. FTL పరిధిలో ఉండి.. నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్న వారికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. 10 నుంచి 15 రోజుల గడువును ఇచ్చింది. అంతలోపు స్వతహాగా కూల్చివేయాలని లేదా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హైడ్రా అధికారులు సూచించారు. గడువు ముగిసిన తర్వాత కూల్చివేస్తామని హైడ్రా అధికారులు వెల్లడించారు.

Read also: KTR: తప్పులు జరగలేదంటే రాజకీయ సన్యాసం చేస్తా.. పొంగులేటి కి కేటీఆర్‌ సవాల్‌..

అమీన్ పూర్ అప్ డేట్..

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్ గుడా, కృష్ణరెడ్డిపేట లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి మిషన్ రిపేర్ పూర్తవ్వడంతో కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్నారు. పటేల్ గుడా లో ఇప్పటి వరకు హైడ్రా అధికారులు నాలుగు భవనాలు నేలమట్టం చేశారు. భారీ యంత్రాలతో మిగతా కట్టడాలను కూడా కూల్చి వేస్తున్నారు.
సూపర్‌ రిజల్ట్.. చింతపండు గుజ్జుతో ఫేస్‌ వాష్‌