రుణయాప్‌ల పేరుతో అమయాకులకు ప్రజల అవకాశాన్ని సొమ్ముచేసుకుంటున్న వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రుణ యాప్ ల కేసులో బ్యాంకింగేతర సంస్థ సీఈఓను ఈడీ అరెస్టు చేసింది. కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ పవిత్ర ప్రదీప్ వాల్వేకర్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
39 ఫిన్ టెక్ కంపెనీలకు కుడోస్ సర్వీస్ ప్రొవైడర్ గా వ్యవహరించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో కుడోస్ సంస్థ రూ.24 కోట్ల అక్రమ లబ్ధి పొందిందని ఈడీ అధికారులు వెల్లడించారు. కుడోస్ సహకారంలో 39 కంపెనీలు రూ.544 కోట్ల లబ్ధి పొందాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు.