NTV Telugu Site icon

KTR Tweet: కొద్ది రోజులు రెస్ట్ కావాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్..

Ktr

Ktr

KTR Tweet: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. ఈ పనులన్నింటికీ కొద్దిరోజుల పాటు దూరంగా ఉండాలని తాను రిఫ్రెష్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజులుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేనందున రాజకీయ ప్రత్యర్థులు తనను మిస్ కాకుండా ఉండరని ఆశిస్తున్నా అని ట్వీట్‌లో రాశారు. ఎక్స్ లో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీకు బదులు బ్యాటింగ్ చేస్తాం సార్.. మిమ్మల్ని మిస్ కాకుండా చూసుకుంటామని నెటిజన్లు రీ ట్వీట్‌ చేశారు.

Read also: TGPSC: టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..


V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి..

కాగా.. దీక్షా దివస్ కార్యక్రమానికి వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించడం ద్వారా ప్రతి గ్రామ కార్యకర్త హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జోరు చూపించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అప్పటి వరకు కేడర్‌లో మరింత ఉత్సాహం నింపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అందుకే ఈ గ్యాప్‌లో కేటీఆర్ విరామం తీసుకోవాలని అనుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే కవిత కూడా యాక్టివ్‌గా మారారు. మరోవైపు హరీష్ రావు ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. వీరిద్దరూ కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కాస్త విరామం తీసుకుని మరింత ఉత్సాహంతో రావాలని కేటీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి..