NTV Telugu Site icon

KTR Comment: సీఎం రేవంత్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

Revanth Reddy Ktr

Revanth Reddy Ktr

KTR Comment: ఫార్ములా ఈ రేస్ పై కేబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రేస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా? లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి మీడియా సమావేశం అవినీతి జరుగలేదు అని పొన్నం ప్రభాకర్ చెప్పారన్నారు. ప్రోజీసర్ కరెక్ట్ గా లేదు.. అంతేకాని అవినీతి లేదని అన్నారు. నేను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పడం జరిగిందని కేటీఆర్ అన్నారు. నేనేం భయపడటం లేదన్నారు. అయిన మేము అలానే ముందుకు పోతామంటే.. మేము కూడా లీగల్ గా ముందుకు వెళతామని కేటీఆర్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాలన్నారు.

Read also: Australia Squad Announcement: చివరి 2 టెస్టులకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ ను మార్చేసిన టీం మేనేజ్‌మెంట్‌

క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మోబిలైజేషన్ అని ఉండేది.. దానికి హరీష్ రావు చైర్మన్ ఉండేదన్నారు. ఓఆర్ఆర్ పై టీఓటీ విధానంపై మేము రూ.7400 కోట్లు తెచ్చి రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ టీఓటీని పారదర్శకంగా చేయడం జరిగిందన్నారు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు.. దానికి హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డి పై పరువునష్టం దావా వేశారని కేటీఆర్ గుర్తుచేశారు. అంతేకాదు ఇప్పుడు పదే పదే కుంభకోణం జరిగిందని అన్నారు కదా.. మరి ఆ పర్మిషన్ రద్దు చేయలేదన్నారు. ఓఆర్ఆర్ పై సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. సిట్ అంటేనే ఆయన కోసం పని చేసే అధికారులు ఉంటారని తెలిపారు. ప్రమోషన్ కోసం పని చేయాల్సిన వారు ఉన్నారన్నారు. నేషనల్ హైవే వాళ్ళు పెట్టిన టిఓటి ప్రకారమే వెళ్ళాం తప్ప ఇంకోటి లేదన్నారు.
Minister Ramprasad Reddy: భారతదేశంలో నంబర్ వన్‌గా ఏపీఎస్ఆర్టీసీని నిలబెడతాం!

Show comments