NTV Telugu Site icon

KTR: మన్మోహన్‌ సింగ్‌ కే కాదు పీవీ కి కూడా.. అసెంబ్లీలో కేటీఆర్‌..

Ktr Assembly

Ktr Assembly

KTR: సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానికి బీఆర్‌ఎస్‌ తరుపున పూర్తీగా మద్దుతు తెలుపుతుందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో దివంగత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్. మన్మోహన్‌ సింగ్ కు నివాళి అర్పించారు. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కు భారత రత్న ఇవ్వాలని సీఎం ప్రతిపాదనకు పూర్తీగా మద్దుతు తెలుపుతున్నామని కేటీఆర్‌ అన్నారు.

Read also: Bhatti Vikramarka: దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే..

భారత రత్న పురష్కారానికి మన్మోహన్‌ సింగ్‌ అర్హులని తెలుపుతూ ఏకీభావం తెలుపుతున్నామన్నారు. ప్రజా స్వామ్య ఉద్యమాలకు విలువ ఇచ్చిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని కేటీఆర్‌ తెలిపారు. మన్మోహన్ కాదు మౌన మోహన్ అన్న ఆయన పనికి ఆయన చేసుకున్నారన్నారు. మన్మోహన్ సింగ్ కి గౌరవ ప్రదమైన విలువ పీవీ నరసింహ రావుకి దక్కలేదన్నారు. పీవీ కి కూడా డిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలన్నారు. మన్మోహన్ సింగ్ కి గుర్తింపు ఇచ్చిందే… పీవీ అన్నారు. మన్మోహన్ సింగ్ కి చేసే సంతాప తీర్మానంలో.. పీవీకి కూడా డిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని కోరారు.

Read also: CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ కి భారత రత్న, తెలంగాణలో విగ్రహం.. అసెంబ్లీలో సీఎం..

మన్మోహన్ సింగ్ తెలివితేటలు గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అన్నారు. ప్రపంచాన్ని పరిగెత్తించేలా చేసిన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ కి జీవితాంతం సేవలు అందించిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా… కాంగ్రెస్ చేసిన ఆందోళనలు కూడా పాల్గొన్నారు మన్మోహన్ సింగ్. అది ఆయనకు పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. తెలంగాణ ఉద్యమ బలం గుర్తించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు.
TG Assembly: అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి..

Show comments