KTR Tweet: మూసీ మురుగులో పొర్లుతూ అందరికీ బురదను అంటించాలని.. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
- కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కేటీఆర్ మరో సారి ట్విటర్ వేదికగా ఫైర్..
- పాలన చేతకాక పనికిమాలిన మాటలు అంటూ ట్విటర్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సారి ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్ తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని తెలిపారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు.
Read also: Thaman : వచ్చే ఏడాది సందడంతా తమన్ దే
Also Read
- DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
- DSP Bheem Reddy : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్
- Etela Rajender : హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కార్‌కు తిప్పలు తప్పవు..
- Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్‌లపై పొంగులేటి ఫైర్
మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయం లో (పర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అయిందని గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందన్నారు. బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందన్నారు. మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది అని గుర్తు చేశారు. ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైందని, దేశంలోనే ధాన్యరాశిగా మారిందన్నారు.
Read also: IMD Weather: వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
పేదల కంట కన్నీరు లేకుండానే పారిస్, బొగొటా, మెక్సికో సిటీ, మోంటేరియల్ లను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకుందని గుర్తుచేశారు. మూసీ నదికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ పక్కన పెట్టుబడి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మనీ స్పిన్నింగ్ కోసమా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ? అంటూ ప్రశ్నించారు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. సమావేశాల్లో తల కిందకి, మీదకి తిప్పితేనో అభివృద్ధి జరగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటూ ప్రభుత్వ బడి పిల్లల ఇజ్జత్ తీయకు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడతారు. ప్రపంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని ట్విటర్ వేదికగా తెలిపారు.
పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది…
— KTR (@KTRBRS) October 18, 2024
Allagadda Politics: నేతల మధ్య మాటల యుద్ధం.. ఆళ్లగడ్డలో హైటెన్షన్..!
తాజావార్తలు
-
Naga Vamsi: ‘పెద్ది’ కోసమే సైలెంట్ అయ్యా.. లేదంటే కావాలనే చేశాననేవారు.. అసలు విషయం చెప్పేసిన నాగవంశీ!
-
Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
-
VenkyAnil5: సెట్స్‌పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
-
Sanju Samson: సంజు శాంసన్‌కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!