NTV Telugu Site icon

KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై ట్వీటర్‌ వేదికగా ధ్వ‌జ‌మెత్తిన కేటీఆర్‌..

Ktr

Ktr

KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీటర్‌ వేదికగా తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా ? అని మండిపడ్డారు. పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా ? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? అని ట్విట్ చేశారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? అన్నారు. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? అని తెలిపారు. బతుకమ్మ చీరెలను రద్దు చేసారు..ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా..? అని ప్రశ్నించారు.

Read also: Online Betting: నిజామాబాద్‌ లో విషాదం.. బెట్టింగ్ బానిసై కుటుంబంతో సహా ఆత్మహత్య..

మరోవైపు మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? అంటూ మరో ట్వీట్ చేశారు కేటీఆర్. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు? అని మండిపడ్డారు. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? .. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? అని ట్వీటర్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. మరో మూడు రోజులు వానలు

Show comments