KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తిన కేటీఆర్..
- బతుకమ్మ- మూసీపై ట్వీటర్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం..
- మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? అంటూ ఫైర్..
- బతుకమ్మ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పై ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీటర్ వేదికగా తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా ? అని మండిపడ్డారు. పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా ? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? అని ట్విట్ చేశారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? అన్నారు. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? అని తెలిపారు. బతుకమ్మ చీరెలను రద్దు చేసారు..ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా..? అని ప్రశ్నించారు.
Read also: Online Betting: నిజామాబాద్ లో విషాదం.. బెట్టింగ్ బానిసై కుటుంబంతో సహా ఆత్మహత్య..
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
మరోవైపు మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? అంటూ మరో ట్వీట్ చేశారు కేటీఆర్. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు? అని మండిపడ్డారు. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? .. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? అని ట్వీటర్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు?
✳️ రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?
✳️ రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?
✳️ మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు…
— KTR (@KTRBRS) October 5, 2024
Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. మరో మూడు రోజులు వానలు
తాజావార్తలు
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్‌కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!