NTV Telugu Site icon

KTR Tweet: అనుముల తిరుపతి రెడ్డి గారు!.. ఆ కిటుకేదో చెప్పండి..

Ktr Yenumula

Ktr Yenumula

KTR Tweet: హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికపై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎల్‌కేజీ చదువుతున్న వేదశ్రీకి పుస్తకాలు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు.. 50 ఏళ్ల కస్తూరి బాయి జీవనోపాధి కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది.. వారం రోజుల క్రితం గృహప్రవేశం చేసిన ఇంటికి అన్ని సాక్ష్యాలతో కాగితాలన్నీ ఉన్నా పేక మేడలా కూలగొట్టారు.. తిరుపతి రెడ్డి గారూ.. ఒక్క క్షణం కూడా టైం ఇచ్చే ప్రయోజనం లేదన్న హైడ్రా .. మీ విషయంలో నోరు మొదపలేదన్నారు. వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజులు సమయం ఇచ్చింది. కోర్టులో స్టే తెచ్చుకున్నారు.. బహుశా ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతల్లో మట్టి కూడా అంటనిది బహేశా మీకు మాత్రమేనా.. బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు మీరు అవలంబించిన కిటుకు చెప్పండి అంటూ కేటీఆర్ ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు.

మరోవైపు గత పదేళ్లుగా సాగుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గందరగోళంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు నిద్ర వదులుతాడో, కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ అడ్మిషన్లు ఎప్పుడు చేస్తుందో? గడువు దగ్గర పడుతోంది కానీ ఈ సందిగ్ధం ఎప్పుడు తీరుతుంది? స్థానికత విషయంలో తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 33 జీఓతో ఈ సమస్య తలెత్తిందన్నారు. అనవసర జీఓ తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Gold Rate Today: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు.. నేటి గోల్డ్ రేట్స్‌ ఇవే!