NTV Telugu Site icon

Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. ఆ జంట విడాకులకు ఆయనే కారణం..!

Konda Surekha

Konda Surekha

Konda Surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. హరీష్ రావు మనసున్నానిషిగా స్పందించారు. నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు తల్లి లేదా అని మండిపడ్డారు. మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారన్నారు. మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు అని ప్రశ్నించారు. కొంతమంది హీరోయిన్లు తొందర పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు.

Read also: KTR: కొండా సురేఖ.. దొంగ ఏడుపులు..పెడబొబ్బలు దేనికి?.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

సినిమా ఇండస్ట్రీ నుండి కొందరు హిరోహిన్లు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ అన్నారు. ఎంతో మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆదుకున్నాడు అని తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ అలవాటు చేశాడని మండిపడ్డారు. దసరా పండుగ ముందు.. అడ బిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతీ దానికీ ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్.. నామీద ట్రోల్ చేసిన దాని పై ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ కంటే..హరీష్ రావు బెటర్ అన్నారన్నారు. హరీష్ రావు కనీసం స్పందించారన్నారని తెలిపారు. బామ్మర్ది కంటే.. బావకు సంస్కారం ఉంది. మూడు రోజుల క్రితమే కేటీఆర్.. మాకు సంబంధం లేదు అని ఐనా చెప్పాలి కదా..? అని ప్రశ్నించారు. మార్ఫింగ్ చేయాలని మేము అనుకుంటే.. ఆయన పెళ్ళాం ఫోటో నో.. చెల్లె ఫోటో నో పెట్టీ చేయలేమా..? మేము అని మండిపడ్డారు. కానీ.. మాకు సంస్కారం ఉంది.. అలా చేయమన్నారు.
Pandu Ranga Temple: ఆ గుడికి వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతారు.. ఎందుకో తెలుసా?