Site icon NTV Telugu

Kishan Reddy: భారత్కి ఏ సమస్య వచ్చినా.. భాగ్యనగరం ముందుండాలి..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: ఆపరేషన్‌ సింధూర్‌ విజయాన్ని పురస్కరించుకుని భారత సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌ పై బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సచివాలయం జంక్షన్‌ మీదుగా సైనిక ట్యాంక్‌ వరకు కొనసాగింది. ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Read Also: Karnataka: విషాదం.. వధువుకు తాళి కట్టిన క్షణాల్లోనే వరుడు మృతి..

ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి పాకిస్తాన్ తోక వంకర చేసింది మన సైన్యం.. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నారు. ఈ యుద్ధంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించాం.. సైన్యంలో మన ఆయుధాలతో నిండిపోయింది.. టెర్రరిస్టులు ఎప్పుడైతే దాడి చేశారో అప్పటికే మన సైన్యం మొత్తం మన ఆయుధాల వాడకంపై పూర్తి పట్టు తెచ్చుకుంది.. ఈ యుద్ధం లో ఆకాష్ క్షిపణినీ వాడారు.. వాళ్ళ ప్రతి చర్యలను మనం ధ్వంసం చేయగలిగాం.. మన దగ్గర చాలా గొప్ప ఆయుధాలు, క్షిపణులు ఉన్నాయి.. అయితే, భారతదేశానికి ఏదైనా సమస్య వస్తే భాగ్యనగరం ముందుండాలని కిషన్ రెడ్డి కోరారు.

Exit mobile version