Site icon NTV Telugu

G. Kishan Reddy: నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను..

G. Kishan Reddy

G. Kishan Reddy

G. Kishan Reddy: మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చిన మీరు నన్ను సంప్రదించవచ్చు నా ఆఫీస్ ని సంప్రదించవచ్చు మీ సమస్యల్ని పరిష్కరించేందుకు నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాసవి బృందావన్ సభ్యుల సమావేశం సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను గెలిపించిన మీ అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సమయంలో నైన మీ సమస్యలు తీర్చేందుకు మీ సవాళ్ళను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు ఆ అప్పులకు మిత్తులు కూడా కట్టలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టి వేసాయి గత ప్రభుత్వాలు ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందన్నారు. కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్ లకు ఇవ్వడానికి కూడా డబ్బుకు లేవు టెండర్లు ఇవ్వలేక పోతున్నారని అన్నారు.

Read also: TG DSC Hall Tickets: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్.. నేడు హాల్‌ టికెట్లు విడుదల..

తెలంగాణ లో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు మౌలికమైన వసతుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుతత్వం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రాధాన్యతల్ని మార్చుకుంటున్నాయన్నారు. డిఫెనన్స్, ఐటీ, ఫార్మా, హెల్త్, లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్ హబ్ గా ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజల మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వాలకు కృషి చేయాలని తెలిపారు. ఇంట్రెస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి అప్పుడే ప్రజల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి కానీ ఈ ప్రభుత్వానికి అవేం పట్టడం లేదు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను ఇన్ఫాస్ట్రక్చర్ కి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నానని అన్నారు. నగరం పెరుగుతుంది కాబట్టి ప్రజల మౌలికవసతుల ఏర్పటుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడే రెండిటినీ బ్యాలెన్స్ చేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుంది అది బ్యాలన్స్ లేకపోతే ముందు ముందు ఇన్వెస్ట్మెంట్ రావు అని తెలిపారు. ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్తాగా ఎదిగిన భారత్ త్వరలో మూడో స్థానానికి ఎగబాకనుంది అ దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Read also: Realme Narzo 70 Offer: రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఈ ఒక్క రోజే!

వికసిద్భారత్ లో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను ఆవిష్కరించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి చంద్రయాన్ వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా కేంద్రం కట్టుబటి ఉంది.. కానీ గత ప్రభుత్వం హైదరాబాద్ అంటే హైటెక్ సిటే అనే విదంగా వ్యవహరించింది హైదరాబాద్ అంటే పాతభాస్థి అనే విషయాన్ని మర్చిపోయింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ నగరం పై ఒక ప్రణాళికే లేదన్నారు. మీ ఆశీర్వాదం తో రెండోసారి గెలిచాక మోదీగారు బోగు గనుల శాక మంత్రిగా అవకాశం ఇచ్చారు. దేశానికి ఈ రోజు బొగ్గు లైఫ్ లైఫ్ లైన్ లాంటిది దేశంలో 85% పవర్ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందన్నారు. నన్ను గెలిపించిన మీరు గర్వ పడేలా నేను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తానని అన్నారు. మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చిన మీరు నన్ను సంప్రదించవచ్చు నా ఆఫీస్ ని సంప్రదించవచ్చు మీ సమస్యల్ని పరిష్కరించేందుకు నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
Mallu Bhatti Vikramarka: ప్రజల సమస్యలు తెలుసు.. కానీ అభిప్రాయం తీసుకుంటాం..

Exit mobile version