NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ఇన్‌చార్జీలుగా కిషన్‌రెడ్డి, రాంమాధవ్‌.. ఉత్తర్వులు జారీ..

Kishan Reddy

Kishan Reddy

Jammu Kashmir: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు సెప్టెంబర్ 18న, రెండో విడత ఎన్నికలు 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనున్నాయి.అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Read also: Siddipet Crime: చేర్యాలలో సైబర్‌ మోసం.. పోలీసుల పేరుతో 30 వేలు కాజేసిన కేటుగాళ్ళు

జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. మాధవ్ 2014-20 కాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అతను జమ్మూ కాశ్మీర్, అస్సాం మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను నిర్వహించే బాధ్యతను కలిగి ఉన్నాడు. సెప్టెంబర్ 26, 2020 న, పునర్వ్యవస్థీకరణలో భాగంగా బిజెపి అతన్ని ప్రధాన కార్యదర్శి పదవి నుండి తొలగించింది.
Utpalendu Chakraborty Death: ప్రముఖ డైరెక్టర్ ఉత్పలేందు చక్రవర్తి మృతి!